Anama Brothers: ఏఆర్ విద్యాసంస్థల కేసు.. సుప్రీంకోర్టులో ఆనం బ్రదర్స్ కు చుక్కెదురు!

  • ఎన్నో ఏళ్లుగా విచారణలో ఉన్న ఏఆర్ విద్యాసంస్థల కేసు
  • పిటిషనర్లకు అనుకూలంగా వెలువడిన తీర్పు
  • జూలైలోగా కమిటీని నియమించాలని సుప్రీం ఆదేశం

ఎన్నో సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో నలుగుతున్న వీఆర్ విద్యాసంస్థల కమిటీపై ఏబీవీపీ పూర్వ విద్యార్థులు వేసిన కేసులో ఆనం సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దాదాపు రూ. 1000 కోట్ల విలువైన ఆస్తులున్న వీఆర్ విద్యాసంస్థలు మూడు దశాబ్దాలకు పైగా ఆనం బ్రదర్స్ అధీనంలో నడుస్తున్నాయి. విద్యాసంస్థల ఆస్తులు, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, విద్యా సంస్థల కమిటీల నియామకం సక్రమంగా లేదంటూ పూర్వ విద్యార్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు వారికి అనుకూలంగానే వచ్చింది.

ఆపై జడ్జిమెంట్ ను సవాల్ చేస్తూ, ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు పాత కమిటీని రద్దు చేస్తున్నామని, వెంటనే కొత్త కమిటీని నియమించాలని చెబుతూ, హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. కొత్త కమిటీ నియామకాన్ని జూలైలోపు ముగించాలని ఆదేశించింది. జిల్లా కోర్టు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరపాలని తీర్పిచ్చింది.  

Anama Brothers
Supreme Court
VR Educational Institution
Nellore District
  • Loading...

More Telugu News