AMAZON: ఇకపై నచ్చిన వస్తువు ఫొటోతో అమేజాన్ లో సులభంగా షాపింగ్...!
- బార్ కోడ్, ఫొటో సెర్చింగ్ సదుపాయంపై కసరత్తు
- దీని ద్వారా వస్తువును సులభంగా గుర్తించే వీలు
- విజయం సాధిస్తే అమ్మకాలకు ఊపు
ఫొటో, బార్ కోడ్ ఆధారిత సెర్చింగ్ సదుపాయాన్ని తీసుకురావాలని అమేజాన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కస్టమర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచే ఫొటో సాయంతో సులభంగా వస్తువులను వెతికి కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించాలన్నది అమేజాన్ ప్రయత్నం. దీనివల్ల ఉత్పత్తులను వెతికి పట్టుకోవడం సులభంగా మారుతుందని భావిస్తోంది.
ఆఫ్ లైన్ లో ఏదైనా ఉత్పత్తి తమకు నచ్చితే బార్ కోడ్ ను స్కాన్ చేసి అమేజాన్ యాప్ లో దాని కోసం ఆర్డర్ చేసే సదుపాయం రానుంది. చైనాకు చెందిన టిమాల్ గతేడాది ఇదే ఫీచర్ పై ప్రయోగాలు చేసి విజయం సాధించింది. అమేజాన్ ప్రయత్నాలు కూడా సఫలం అయితే దేశీయంగా ఆ సంస్థ విక్రయాలు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి.