trevar chapel: అన్న మాట విని చేసిన ఆ తప్పుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నా: ట్రెవర్ ఛాపెల్

  • 1981లో ఫైన‌ల్ మ్యాచ్‌ లో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసిన ట్రెవర్ ఛాపెల్
  • అలా చేయమని సలహా ఇచ్చిన గ్రెగ్ ఛాపెల్
  • దాంతో అప్రదిష్ఠ మూటగట్టుకున్న ట్రెవర్ ఛాపెల్

1981లో తన అన్న గ్రెగ్ ఛాపెల్ మాట విని తాను చేసిన ప‌ని వ‌ల్ల 37 ఏళ్లుగా ప్ర‌శాంత‌త‌కు దూర‌మ‌య్యాన‌ని ఆసీస్ మాజీ పేసర్ ట్రెవర్ ఛాపెల్ అన్నాడు. 1981లో జ‌రిగిన బెన్స‌న్ అండ్ హెడ్జెస్ సిరీస్ ఫైన‌ల్ మ్యాచ్‌ లో విజ‌యం కోసం అండర్ ఆర్మ్ బౌలింగ్ చేశానని, దీంతో తనకు చెడ్డపేరు వచ్చిందని తెలిపాడు. దాని వల్ల తన వివాహం విచ్ఛిన్నమైందని గుర్తుచేసుకున్నాడు. పిల్లలు లేరని, ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే, బాల్ ట్యాంపరింగ్ తాజా వివాదంతో తనపేరు మరుగున పడిపోతుందని, ప్రస్తుత ఆటగాళ్లను బాల్ టాంప‌రింగ్ వివాదం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్పాడు. భ‌విష్య‌త్తులో వారంతా ఇబ్బంది ప‌డాల్సిందేనని అన్నాడు. గూగుల్ లో సీఏకు చెడ్డపేరు తెచ్చిన వారు ఎవరని టైప్ చేస్తే ఇన్నాళ్లూ తన పేరు కనబడేదని, ఇకపై ఇప్పటి జట్టు ఆటగాళ్ల పేర్లు కనబడతాయని ట్రెవర్ పేర్కొన్నాడు.

trevar chapel
greg chapel
Australia
Cricket
ball tamparing
  • Loading...

More Telugu News