Indian railways: నిరుద్యోగ భారతం: రైల్వేలో 90,000 వేల ఉద్యోగాలకు 2 కోట్ల దరఖాస్తులు!

  • రైల్వేల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
  • 90,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
  • ఉద్యోగానికి 222 చొప్పున మొత్తం 2,00,00,000 అప్లికేషన్లు

దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు.. రైల్వేల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులే చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా రైల్వే శాఖ 90,000 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా, దానికి వచ్చిన స్పందన చూసి రైల్వే అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో ఉద్యోగానికి 222 మంది చొప్పున రెండు కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఇంకా చివరి తేదీకి గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంత మందికి పరీక్షలు నిర్వహించడం ఎలా? అని రైల్వే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

Indian railways
notification
employeement
jobs
  • Loading...

More Telugu News