YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఇద్దరు గుంటూరు జిల్లా నేతలు

  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆదినారాయణ, నాగేశ్వరరావు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • సత్తెనపల్లిలో కోడెల సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న వైసీపీ చీఫ్

అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, మునిసిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆదినారాయణ, నాగేశ్వరరావులకు జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బాబును బలహీన పర్చడం అంటే రాష్ట్రాన్ని బలహీన పర్చడమేనన్న టీడీపీ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు పూర్తయ్యాక బాబుకు అఖిలపక్షం గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్పీకర్ కోడెల సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News