China: రామ్ చరణ్ బర్త్ డే .. అమ్మానాన్న, బాబాయ్ పవన్ తో చెర్రీ దిగిన ఫొటో!

  • కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేసిన రామ్ చరణ్
  • చిరు దంపతులు, పవన్ తో కలిసి ఫొటో దిగిన చెర్రీ
  • ‘కొణిదెల కుటుంబసభ్యుల అనుబంధం’ అంటూ ఉపాసన పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు తన బర్త్ డే జరుపుకుంటున్నాడు. 33వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తన కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేశాడు. తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు బాబాయ్ పవన్ కల్యాణ్ ల మధ్య రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు.

ఈ సందర్భంగా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్, చెర్రీకి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘కొణిదెల కుటుంబసభ్యుల అనుబంధం..అత్తమ్మ వండిన అద్భుతమైన లంచ్..హ్యాపీ బర్త్ డే మిస్టర్ సి’ అని ఆ పోస్ట్ లో ఉపాసన పేర్కొంది.

  • Loading...

More Telugu News