Rahul Gandhi: మోదీ దగ్గర ఓ పెద్ద ఉపాయమే ఉంటుందని భావిస్తున్నా: రాహుల్‌ గాంధీ సెటైర్

  • డోక్లాం విషయంలో చైనా రెచ్చగొట్టే ప్రకటనలపై మోదీకి రాహుల్ గాంధీ చురకలు 
  • గత వారం ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారన్న రాహుల్
  • అందులో 63 శాతం మంది అనుకున్నది చాలా తప్పని ట్వీట్

భారత్, చైనా, భూటాన్ సరిహద్దులోని డోక్లాం విషయంపై చైనా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, డోక్లాం అంశం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని చైనా మరోసారి పేర్కొన్న విషయంపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... డోక్లామ్‌ విషయంలో భారత ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, బహుశా పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారేమోనని చురకలంటిస్తూ ట్వీట్ చేశారు.

గత వారం ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారని, అందులో 63 శాతం మంది మోదీ తన హగ్‌ప్లోమసీ (ఇతర దేశాల అధినేతలతో మోదీ ఆలింగనాలు)ని ఉపయోగించి కూడా డోక్లామ్‌ అంశానికి పరిష్కారం చూపలేకపోతున్నారని ఓటు వేశారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, ఆ 63 శాతం మంది అనుకున్నది చాలా తప్పని, దేశం కోసం మన 56 ఇంచుల ఛాతి (మోదీకి సంబంధించి) దగ్గర ఓ పెద్ద ఉపాయమే ఉంటుందని భావిస్తున్నానని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News