charan: కొరటాలతో సినిమా ఉందని చెప్పిన చరణ్!

  • విడుదల తేదీకి దగ్గరలో 'రంగస్థలం'
  • తరువాత సినిమా బోయపాటితో 
  • రాజమౌళితో మల్టీ స్టారర్ వుంది      

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేసిన 'రంగస్థలం' సినిమా, ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చరణ్ మాట్లాడుతూ, తన తదుపరి సినిమాలను గురించి ప్రస్తావించాడు. 'రంగస్థలం' తరువాత తన నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టి .. దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చూసే ఆలోచనతో వున్నానని అన్నాడు.

ఈ సినిమా తరువాత రాజమౌళితో మల్టీ స్టారర్ చేయనున్నాను. ఇక కొరటాల శివతోను సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కసరత్తు పూర్తయిన తరువాత తెలియజేస్తానని అన్నాడు. కొరటాల - చరణ్ కాంబినేషన్లోని సినిమా కొంతకాలం క్రితమే రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ సారి ఈ కాంబినేషన్ తప్పకుండా సెట్స్ పైకి వెళుతుందనే నమ్మకం చరణ్ మాటల వలన కలుగుతోంది.    

  • Loading...

More Telugu News