Vijay Sai Reddy: వైసీపీ బండారం ఈ రోజు బట్టబయలైంది: విజయసాయిరెడ్డిపై సీఎం రమేష్ ఫైర్

  • పార్లమెంటులో మోదీ కాళ్లు మొక్కుతారు
  • బయటకొచ్చి చంద్రబాబును విమర్శిస్తారు
  • అవిశ్వాసం పేరుతో వైసీపీ నాటకాలు ఆడుతోంది

రాజ్యసభలో ప్రధాని మోదీ కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. తాను మోదీ కాళ్లకు నమస్కరించలేదని విజయసాయి చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, విజయసాయిపై మండిపడ్డారు. పార్లమెంటులో మోదీ కాళ్లపై పడతారని, బయటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ కాళ్లపై పడలేదననే విషయాన్ని గుండెపై చేయి వేసుకుని చెప్పాలని విజయసాయికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను విజయసాయి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం పేరుతో వైసీపీ నాటకాలాడుతోందని... వైసీపీ అసలు బండారం ఈరోజు బయటపడిందని ఎద్దేవా చేశారు.

Vijay Sai Reddy
Narendra Modi
CM Ramesh
raya sabha
blessings
foot touch
  • Loading...

More Telugu News