idea: ఐడియా-వొడాఫోన్ విలీన అనుమతి త్వరలోనే... ప్రక్రియ వేగవంతం

  • టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ 
  • ఈ విషయం చాలా అనుమతులతో ముడిపడి ఉందని వెల్లడి
  • నూతన టెలికం విధానం కూడా సిద్ధమవుతోందని ప్రకటన

ఐడియా, వొడాఫోన్ కంపెనీలకు అనుమతి ప్రక్రియ తుది దశలో ఉందని టెలికం శాఖ సెక్రటరీ అరుణ సుందరరాజన్ తెలిపారు. ఈ విషయంలో ఎన్నో అనుమతుల అవసరం ఉందన్నారు ఆమె. ‘‘ఐడియా-వొడాఫోన్ విలీనం తుది అనుమతుల దశలో ఉంది. ఇప్పటికే ఎన్ సీఎల్ టీ, సెబీ నుంచి అనుమతులు వచ్చాయి. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ), లైసెన్స్  నిబంధనల సరళీకరణ వంటి అనుమతుల అవసరం కూడా ఉంది. ఒక్క ఆమోదంతో అయ్యేది కాదు. కనుక దీన్ని వేగవంతం చేస్తున్నాం’’ అని టెలికం శాఖా కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. నూతన టెలికం పాలసీ 2018 సైతం తుది దశలో ఉందని ఆమె తెలిపారు. అనంతరం దీనికి టెలికం కమిషన్ ఆమోదముద్ర వేస్తుందన్నారు.

idea
vodafone
  • Loading...

More Telugu News