nokia1: రూ.5,499కే నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్... రేపటి నుంచే విక్రయం

  • నోకియా 1 మోడల్ విడుదల
  • ఆండ్రాయిడ్ గో వెర్షన్ పై పనిచేసే ఫోన్
  • మూడు రంగుల్లో కవర్లు

నోకియా నుంచి ప్రారంభ స్థాయి స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో పనిచేసే నోకియా 1 విడుదల అయింది. దీని ధర రూ.5,499. రేపటి నుంచే దీని విక్రయాలు దేశవ్యాప్తంగా మొదలవుతాయి. గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించిన విషయం గుర్తుండే ఉంటుంది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీనికి అదనంగా అజూర్ గ్రే, యెల్లో, పింక్ కలర్స్ తో కూడిన మూడు కవర్లను ప్రత్యేకంగా రూ.450 ధరకు విక్రయించనుంది. యూజర్లు తరచూ కవర్ మార్చుకుంటూ కొత్త దనాన్ని ఆస్వాదించొచ్చు.

ఆండ్రాయిడ్ గో వెర్షన్ సాఫ్ట్ వేర్ అన్నది ప్రారంభ స్థాయి మోడళ్లలోనూ వేగంగా నెట్, యాప్స్ ను వినియోగించుకునేందుకు వీలు కల్పించేది. నోకియా 1 ఫోన్లో 4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే, 1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 5 మెగా పిక్సల్స్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్స్ ముందు కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 8జీబీ స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 4జీ వోల్టేకు సపోర్ట్ చేస్తుంది.

  • Loading...

More Telugu News