adire abhi: దర్శకుడిగా మారుతున్న 'జబర్దస్త్' ఫేం అదిరే అభి!

  • 'జబర్దస్త్'తో అదిరే అభికి క్రేజ్ 
  • నటుడిగా మంచి గుర్తింపు 
  • దర్శకత్వం దిశగా అడుగులు

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన నటుల్లో 'అదిరే అభి' ఒకరుగా కనిపిస్తాడు. ప్రతివారం విభిన్నమైన కంటెంట్ ను సిద్ధం చేసుకుని .. కడుపుబ్బా నవ్వించే అభి .. త్వరలో దర్శకుడిగా మారుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా దర్శకుడు కావాలనే ఆసక్తితోనే అభి వున్నట్టుగా సమాచారం. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు.

ఇప్పటికే విభిన్నమైన ఒక కథను సిద్ధం చేసుకున్న ఆయన, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసుకునే పనిలో వున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, హర్షవర్ధన్ రాణే హీరోగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.  

adire abhi
  • Loading...

More Telugu News