Actress Jayanti: ప్రముఖ సినీనటి జయంతికి తీవ్ర అస్వస్థత... ఐసీయూలో చికిత్స!

  • ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న జయంతి
  • విక్రమ్ హాస్పిటల్ లో చికిత్స
  • సుమారు 500 సినిమాల్లో నటించిన జయంతి

అలనాటి సినీనటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో తొలుత బెంగళూరు సిటీ ఆసుపత్రికి బంధువులు తరలించారు. వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్న వైద్యులు, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నట్టు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె శరీరంలోని మరిన్ని అవయవాలు పని చేయడం లేదని తెలుస్తోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించిన జయంతి, 1949, జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించారు.

Actress Jayanti
Bengalore
Vikram Holspital
  • Loading...

More Telugu News