Balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ కి రంగం సిద్ధం

  • తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • ప్రధాన పాత్రలో బాలకృష్ణ 
  • రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభం

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను రూపొందించే ఆలోచన వున్నట్టుగా బాలకృష్ణ చెప్పిన దగ్గర నుంచి, నందమూరి అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమా ఎప్పుడు లాంచ్ కానుందా అని వాళ్లంతా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు వార్తలు వినిపించాయి.

ఈ సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి ఇదే తేదీని ఖరారు చేశారు. 'ఎన్టీఆర్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఈ సినిమాను, హైదరాబాద్ - రామకృష్ణ స్టూడియోస్ లో ఆ రోజున ఆరంభించనున్నారు. నటుడిగా ఎన్టీఆర్ అగ్రస్థానానికి చేరుకోవడం .. ఆయన రాజకీయ రంగప్రవేశం .. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వరకూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News