HDFC: 'బ్యాంకు రక్షణ చర్యలు' అంటూ మొనదేలిన ఇనుపరాడ్లు పెట్టించిన హెచ్డీఎఫ్సీ... ప్రజల తిట్లు!
- న్యూఢిల్లీ పోర్ట్ శాఖ ముందు ఏర్పాటు
- ఐదు వందలకు పైగా రాడ్లు అమర్చిన బ్యాంకు
- విమర్శల వెల్లువతో దిగొచ్చిన అధికారులు
తమ బ్యాంకు రక్షణ కోసమంటూ, ముంబై పరిధిలోని ఫోర్ట్ శాఖ ముందు మొనదేలిన ఇనుప రాడ్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏర్పాటు చేయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ దారిన వచ్చీపోయే వాళ్లతో పాటు, నిరుపేదలకు హాని కలిగించేలా ఇవి ఉన్నాయని పలువురు బ్యాంకు వైఖరిని ప్రశ్నించడంతో అధికారులు దిగివచ్చి, వాటిని తొలగించారు.
ఒకటి రెండు కాదు... దాదాపు ఐదు వందలకు పైగా ఇనుప రాడ్లను ఐదు అడుగుల వెడల్పు, 30 అడుగులకు పైగా పొడవున్న కారిడార్ పై బ్యాంకు అధికారులు ఏర్పాటు చేశారు. దీన్నిచూసిన పలువురు ఫొటోలు తీసి బ్యాంకు అధికారుల వైఖరిని ప్రశ్నిస్తూ, తిట్లకు దిగారు. ఇక ఈ విమర్శలను చూసిన బ్యాంకు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ నీరజ్ ఝా స్పందిస్తూ, ఈ నిర్ణయం సదరు శాఖ అధికారులు తీసుకున్నదేనని, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎవరికీ హాని కలిగించాలని ఇవి పెట్టలేదని చెబుతూ, వాటిని తొలగిస్తున్నట్టు వెల్లడించారు.