chiranjeevi: 'సైరా' షూటింగుకి అమితాబ్ .. కీలక సన్నివేశాల చిత్రీకరణ

  • 'సైరా' రెండవ షెడ్యూల్ పూర్తి
  • మూడవ షెడ్యూల్ దిశగా సన్నాహాలు
  • సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ను పూర్తి చేశారు. చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఎల్లుండి నుంచి మూడవ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ షెడ్యూల్లో అమితాబ్ జాయిన్ కానున్నారు. ఆయన కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అమితాబ్ పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనుందని అంటున్నారు. విజయ్ సేతుపతి .. సుదీప్ పాత్రలు కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. చిరంజీవి కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే బలమైన నమ్మకంతో అభిమానులు వున్నారు.  

  • Loading...

More Telugu News