: ఎంత పనిచేశావు 'సంగా'..!
ఉప్పల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చూసిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కుమార సంగక్కర నిర్ణయం తప్పనిపించకమానదు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సంగక్కర చెన్నై జట్టుకు బ్యాటింగ్ అప్పగించగా.. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ మ్యాస్ట్రో సురేశ్ రైనా వీరవిహారం చేశాడు. రైనా (52 బంతుల్లో 99 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సులు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. ఓపెనర్ హసీ (67) మరోమారు ఫామ్ చాటగా, కెప్టెన్ ధోనీ (4) నిరాశపరిచాడు.