tpcc: టీపీసీసీ తీరుపై రాహుల్ కు ఫిర్యాదు చేయనున్న కోమటిరెడ్డి, సంపత్!

  • శాసనసభ్యత్వాల రద్దు వ్యవహారంలో టీపీసీసీ తీరు సరిగా లేదు
  • రెండు రోజుల దీక్ష చేసి ‘మమ’ అనిపించింది
  • రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేస్తాం
  • మీడియాతో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్

తమ శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన విషయంలో టీపీసీసీ సరిగ్గా స్పందించలేదంటూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ మండిపడ్డారు. ఈరోజు వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, తమ సభ్యత్వాల రద్దు విషయంలో టీపీసీసీ స్పందన దారుణంగా ఉందని, రెండు రోజుల దీక్ష చేసి ‘మమ’ అనిపించి వదిలేసిందని విమర్శించారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. అధికార పక్షాన్ని తూర్పారబట్టేందుకు ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పటికీ టీపీసీసీ నేతలు వాడుకోలేకపోతున్నారని, అకారణంగా తమను సస్పెండ్ చేస్తే టీపీసీసీ స్పందన సరిగా లేదని, తమను ఏకాకులను చేశారని వాపోయారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.  

tpcc
Rahul Gandhi
komati reddy
sampath
  • Loading...

More Telugu News