Shopping mall: సైబీరియా షాపింగ్ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 37 మంది సజీవ దహనం

  • షాపింగ్‌మాల్ నుంచి చుట్టేసిన అగ్ని కీలలు
  • కిటికీల నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న ప్రజలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

రష్యాలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కెమెరోవోలోని సైబీరియా సిటీలోని ఓ షాపింగ్‌మాల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ మాల్‌లో సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వందలాదిమందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు.  ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చుట్టు ముడుతున్న అగ్ని కీలల నుంచి బయటపడేందుకు చాలామంది షాపింగ్ మాల్  గోడలు, కిటీకీల నుంచి దూకడం కనిపించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.

కడపటి సమాచారం అందేసరికి 37 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 70 మంది ఆచూకీ కనిపించడం లేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. షాపింగ్ మాల్ నిండా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మాస్కోకు 3600 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెమెరోవో బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచినది.

Shopping mall
Siberia
Fire Accident
Russia
  • Loading...

More Telugu News