mamatha benarji: చంద్రబాబు పోరాటాన్ని మెచ్చుకుంటూ మమతా బెనర్జీ ట్వీట్

  • అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలా మంది ఉన్నారు, అది వారికి అలవాటుగా మారింది
  • రాష్ట్రాలకు నిధులిస్తూ సహకరిస్తున్నట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు
  • కేంద్ర సర్కారు ఇలా చేయడం నకిలీ సమాఖ్య విధానానికి నిదర్శనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పోరాడే క్రమంలో ఎన్డీఏ సర్కారు ప్రజలను మభ్యపెడుతోన్న తీరుపై విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించి చంద్రబాబు నాయుడిని అభినందించారు. అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలా మంది ఉన్నారని, అది వారికి అలవాటుగా మారిందని అన్నారు. రాష్ట్రాలకు నిధులిస్తూ సహకరిస్తున్నట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని, కేంద్ర సర్కారు ఇలా చేయడం నకిలీ సమాఖ్య విధానానికి నిదర్శనమని ఆమె అన్నారు.

mamatha benarji
Chandrababu
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News