laloo prasad yadav: జైల్లో ఉన్న లాలూ ప్రాణాలకు ముప్పు ఎలా?: సుశీల్ మోదీ

  • జైల్లో ఉన్న వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది?
  • ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు
  • ప్రాణభయం ఉంటే కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు

తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ప్రాణ హాని ఉందంటూ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ భయాందోళనలను వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. బీజేపీ, జేడీయూ పార్టీల కుట్రకు తన తండ్రి బాధితుడిగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ స్పందించారు. భయాందోళనలను కొట్టిపారేశారు. జైల్లో, పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆయనను కలుసుకునేందుకు ఎవరినీ అనుమతించడం కూడా లేదని... అలాంటప్పుడు ప్రమాదం ఎలా ఎదురవుతుందని ప్రశ్నించారు. ఒకవేళ ప్రాణ హాని ఉందనుకుంటే కోర్టులో అప్పీల్ చేసుకోవాలని చెప్పారు. 

laloo prasad yadav
tejaswi yadav
susil modi
life threat
  • Loading...

More Telugu News