ayodhya: బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు... మసీదు ఇస్లాంలో భాగమేనా? అన్న దానిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ
- ఇస్లాంలో భాగం కాదని 1994లో సుప్రీంకోర్టు తీర్పు
- ఇప్పుడా తీర్పుపై పునర్విచారణ
- ఆ తర్వాతే తుది తీర్పు అన్న కోర్టు
అయోధ్య బాబ్రీ మసీదు కేసు విచారణ కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో తుది తీర్పు వెల్లడించడానికంటే ముందు అసలు మసీదు అన్నది ఇస్లాంలో భాగమేనా, కాదా? అన్న దానిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
1994లో మసీదు అన్నది ఇస్లాంలో భాగం కాదని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పుపై రాజ్యాంగ ధర్మాసనం పునర్విచారణ చేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసు విచారణ మరింత ఆలస్యం కానుంది. 70 ఏళ్ల నుంచి వివాదం ఉన్న ఈ కేసు విచారణను ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన పెద్ద ధర్మాసనానికి బదిలీ చేయాలన్న ఓ పిటిషనర్ వినతిని కోర్టు తిరస్కరించింది.