Rape victim: హైదరాబాద్‌లో బీపీ టాబ్లెట్లు మింగి 17 ఏళ్ల అత్యాచార బాధితురాలి ఆత్మహత్య

  • 40 బీపీ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్న అత్యాచార బాధిత బాలిక
  • గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నిందితుడిపై పోక్సో చట్టం కింద రేప్ కేసు నమోదు

హైదరాబాద్ నగరంలోని మెట్టుగూడ ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు బీపీ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చిలకలగూడ పోలీసు ఇన్స్‌పెక్టర్ ఆర్.భాస్కర్ అందించిన వివరాల్లోకెళితే... బాధితురాలు నామాలగుండులోని తన అమ్మమ్మ ఇంటికి గురువారం వచ్చింది. అదే రోజు సాయంత్రం ఆమె ఈ కఠిన నిర్ణయానికి పాల్పడింది.

ఇంటిలోని సుమారు 40 బీపీ టాబ్లెట్లను మింగేసింది. హుటాహుటిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ నెల 13న సదరు బాలికను మహ్మద్ అస్లాం (22) అనే యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదైంది.

Rape victim
Suicide
Hyderabad
BP tablets
  • Loading...

More Telugu News