mamatha: నకిలీ పాస్ పోర్టుతో దుబాయ్ వెళ్లేందుకు యత్నం.. తమిళ నటి అరెస్ట్!

  • ఓ నృత్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్తున్న మమత
  • పాస్ పోర్టు నకిలీదని గుర్తించిన అధికారులు
  • కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

చెన్నై విమానాశ్రయంలో కోలీవుడ్ సహాయ నటి మమత (20)ను విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పాస్ పార్టుతో ఆమె దుబాయ్ వెళ్లేందుకు యత్నించగా అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని శాలిగ్రామంలో ఆమె నివసిస్తున్నారు. దుబాయ్ లో జరగనున్న ఓ నృత్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను, ఆమె చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె పాస్ పోర్టును పరిశీలించిన అధికారులు అది నకిలీదని నిర్ధారించారు. వెంటనే విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, మమతను అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు నమోదు చేశారు. నకిలీ పాస్ పోర్టు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

mamatha
kollywood actress
arrest
pass port
fake
  • Loading...

More Telugu News