Karnataka cm: హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ప్రోత్సాహం లేకపోవడంపై మండిపడ్డ సిద్ధరామయ్య

  • దక్షిణాదికి నిధులు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధా?
  • జనాభా నియంత్రణకు ప్రోత్సాహం ఇవ్వరా?
  • కేంద్రం, ఆర్థిక సంఘం తీరుపై కర్ణాటక సీఎం ప్రశ్నాస్త్రాలు

అత్యధిక పన్ను ఆదాయం తీసుకొస్తూ దేశాభివృద్ధికి ఊతంగా నిలవడమే కాకుండా, మహిళా సాధికారత, విద్యలో ముందడుగు వేస్తున్న బెంగళూరు, హైదరాబాద్, కోచి, కోయంబత్తూరు నగరాలను రాయితీలతో ప్రోత్సహించాలని  కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  15వ ఆర్థిక సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహం కరవుపై ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు మళ్లింపు చట్టబద్ధమే. అభివృద్ధి విషయంలో ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడం అవసరమే. అయితే దీన్ని దక్షిణాదికి నిధులు వెచ్చించకుండా ఇతర ప్రాంతాలకు నిధులు మళ్లించడంపైనే ప్రశ్న తలెత్తుతోంది. అభివృద్ధి, జనాభా నియంత్రణలకు ప్రోత్సాహం ఉండదా?’’ అని సిద్ధరామయ్య కేంద్రం తీరును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ పేజీలో అభిప్రాయాలను పోస్ట్ చేశారు.

Karnataka cm
sidharamaiah
  • Loading...

More Telugu News