Revanth Reddy: టీఎస్ అసెంబ్లీలో ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. ఓటు వేయని రేవంత్ రెడ్డి

  • ఓటు వేసిన 108 మంది ఎమ్మెల్యేలు
  • ఓటింగ్ కు దూరంగా టీడీపీ, బీజేపీ, సీపీఎం
  • ఎమ్మెల్యేగా రాజీనామా చేసినందున ఓటు వేయలేదన్న రేవంత్

తెలంగాణ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 108 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మరో గంటలో ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు, రాజ్యసభ ఎన్నికలకు టీకాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. తన ఓటు హక్కును ఆయన వినియోగించుకోలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి తాను బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని... అందుకే ఓటు హక్కును వినియోగించుకోలేదని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. 

Revanth Reddy
Rajya Sabha
elections
BJP
TRS
Congress
Telugudesam
  • Loading...

More Telugu News