Chandrababu: రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాం.. విభజన హామీలు నెరవేరుస్తాం.. ఢిల్లీకి రండి: చంద్రబాబుకు జైట్లీ ఫోన్

  • జైట్లీ ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మన్నారు
  • ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడలేదు
  • కేంద్ర మంత్రులను ఇప్పుడు కలవడం సరికాదన్న యనమల

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారని తెలిపారు. అయితే, ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడలేదని... ఇప్పుడు మనం ఏం చేద్దాం? అని టీడీపీ నేతలను అడిగారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, అన్ని విషయాల్లో ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రులను మనం కలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. ఎక్కడైనా కనిపిస్తే మర్యాదగా పలకరించుకోవడంలో తప్పు లేదని చెప్పారు. ఈ సందర్భంగా యనమల వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకీభవించారు. హీరో శివాజీ వెల్లడించిన 'ఆపరేషన్ ద్రవిడ' గురించి పయ్యావుల, పల్లె రఘునాథరెడ్డిలు ప్రస్తావించగా... అవన్నీ పరిశీలిద్దామని చెప్పారు.

Chandrababu
Arun Jaitly
Yanamala
Special Category Status
railway zone
steel factory
phone
  • Loading...

More Telugu News