Ingaveeti mappillai: కోర్టు మెట్లెక్కిన హీరో 'స్వయంవరం' రియాల్టీ షో...!

  • హీరో ఆర్య 'ఇంగ వీటు మాపిళ్లై'ని నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్
  • ఈ షో మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందని పిటిషనర్ అభ్యంతరం
  • షో నిర్వాహకులు, సెన్సార్ బోర్డు తదితరులకు కోర్టు నోటీసులు
  • కేసు తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా

'ఇంగ వీటు మాపిళ్లై' పేరిట తమిళ హీరో ఆర్య నిర్వహిస్తున్న రియాల్టీ షో కోర్టు మెట్లెక్కింది. ఈ స్వయంవరం కార్యక్రమంలో 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలు పాల్గొంటారు. వారిలో గెలిచిన వారిని ఆర్య వివాహం చేసుకుంటాడంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ షోకి నటి సంగీత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

కలర్స్ తమిళ ఛానల్‌లో ప్రసారమవుతున్న ఈ షో మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉందని, అందువల్ల దీనిని నిలిపి వేయాలంటూ జానకి అమ్మల్ అనే సామాజిక ఉద్యమకారిణి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ షో నిర్వాహకులు, తమిళనాడు రాష్ట్ర సాంకేతిక, సమాచార శాఖ కార్యదర్శిలకు నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.

Ingaveeti mappillai
Hero Aarya
Kollywood
Madras High Court
  • Loading...

More Telugu News