Vijay Sai Reddy: 40 వేల కోట్లు దోచిన విజయసాయిరెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలి: బుద్ధా వెంకన్న

  • నీరవ్, మాల్యా వంటి ఆర్థిక నేరస్థుడు విజయసాయి
  • అలాంటి వ్యక్తికి మోదీ అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారు?
  • చంద్రబాబు ప్రజా నేత

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ. 40 వేల కోట్లు దోచిన విజయసాయిని బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. జగన్ ఓ అవినీతి నాయకుడు అని అన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరస్థుడు విజయసాయికి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ అధినేత చంద్రబాబు ప్రజా నాయకుడని... రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అక్రమ కేసుల నుంచి ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు.  

Vijay Sai Reddy
Chandrababu
Narendra Modi
Nirav Modi
vijaj mallia
  • Loading...

More Telugu News