tammareddy bharadwaja: ఇలాంటి వాటిని ఖండించకపోతే చంద్రబాబు గౌరవానికే నష్టం: తమ్మారెడ్డి భరద్వాజ

  • సినీ పరిశ్రమపై విమర్శలు బాధాకరం
  • ప్రత్యేక హోదాపై పోరాటానికి సినీ పరిశ్రమ సిద్ధంగా ఉంది
  • ఇలాంటి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించాలి

ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నవారిపై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న వారిపై సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా చెప్పుకునే వారు కూడా తప్పుగా మాట్లడుతుండటం బాధను కలిగిస్తోందని అన్నారు. ఇలాంటివారిని చంద్రబాబు ప్రోత్సహించడం సరికాదని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటంలో తెలుగు సినీ పరిశ్రమ వెనుకడుగు వేయదని అన్నారు. హోదా కోసం ఇప్పటికే మురళీమోహన్, రోజా, శివాజీలాంటి వారు పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఎంతో మంది నటీనటులు ఇప్పటికే తమ అభిప్రాయాలను చెప్పారని తెలిపారు. హీరో సంపూర్ణేష్ బాబు అరెస్ట్ కూడా అయ్యారని గుర్తు చేశారు. హోదా కోసం ప్రత్యక్ష పోరాటానికి కూడా సినీ పరిశ్రమ సిద్ధమని అన్నారు. సినీ పరిశ్రమపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించకపోతే చంద్రబాబు పరువు, ప్రతిష్టలకే నష్టం వాటిల్లుతుందని చెప్పారు. 

tammareddy bharadwaja
Chandrababu
Something Special
Tollywood
  • Loading...

More Telugu News