New Delhi: ఢిల్లీ వాసులను ఉలిక్కిపడేలా చేసిన 'భూకంపం' వాట్స్ యాప్ మేసేజ్!

  • వాట్స్ యాప్ లో వైరల్ అవుతున్న ఢిల్లీలో భూకంపం వార్త
  • ఫేక్ వార్తగా కొట్టేస్తున్న నిపుణులు
  • భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదు

ఢిల్లీ వాసులను ఒక వాట్స్ యాప్ మెసేజ్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ మెసేజ్ లో ఏముందంటే ... 'ఏప్రిల్‌ 7 నుంచి 15వ తేదీ లోపు ఢిల్లీలో 9.1-9.2 తీవ్రతతో భారీ భూకంపం రానుంది. దీని ధాటికి ఢిల్లీ శవాలదిబ్బగా మారనుంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోనున్నారు. దీనిపై నాసా కూడా హెచ్చరికలు జారి చేసింది. ఈ భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, జమ్ముకాశ్మీర్‌, తమిళనాడు, బిహార్‌ రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా ఉంటుంది. పాకిస్థాన్ లో 4-4.2 తీవ్రతతో భూమి కంపిస్తుంది' అని ఉంది.

అంతే కాకుండా దీనిపై పూర్తి వివరాలు కావాలంటే నాసాఅలర్ట్‌.కామ్‌ లో చూడండి అంటూ పేర్కొన్నారు. ఇది ఢిల్లీలోని వాట్స్ యాప్ సర్కిల్స్ లో వైరల్ అవుతుండగా, అది ఫేక్ అని తేలింది. ఇందులో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ కథనంలో భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదన్న ప్రాధమిక అంశాన్ని విస్మరించడంతో అది ఫేక్ అని తేలింది. నాసా పేరిట ఉన్న ఈ వెబ్ సైట్ కూడా నకిలీదని తేలింది. ఈ మెసేజ్ ఆందోళనకు గురి చేసిందని, ఫేక్ అని తేలడంతో హాయిగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News