Jagan: జగన్ కు సవాల్ విసిరిన మంత్రి ప్రత్తిపాటి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f143e0e956d04a9269df5e3d4345d8ce2d0a5a11.jpg)
- ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
- నిరూపించకపోతే వైసీపీని మూసేయాలి
- జర్నలిస్టులను హత్య చేయించే సంస్కృతి నాది కాదు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తనపై జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. మంత్రి ప్రత్తిపాటి అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని... నిరూపించలేకపోతే వైసీపీని మూసేస్తారా? అంటూ జగన్ కు సవాల్ విసిరారు.
జర్నలిస్టులను హత్య చేయించేంత నీచమైన సంస్కృతి తనది కాదని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేల ఎకరాల భూమిని దోచుకున్న ఘనత జగన్ దని ఆరోపించారు. ఇద్దరం రాజీనామా చేసి చిలకలూరిపేట నుంచి పోటీ చేద్దామని... జగన్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.