mohammad shami: తీవ్ర ఒత్తిడిలోనూ ప్రాక్టీస్ ప్రారంభించిన షమీ

  • ఆరోపణలు, విచారణ ఎదుర్కొంటున్న షమీ
  • ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్
  • ఐపీఎల్ లో ఆడాలని ఆకాంక్షిస్తున్న అభిమానులు

ఒకవైపు భార్య సంచలన ఆరోపణలు, మరొకవైపు కోల్‌ కతా పోలీసుల విచారణ, ఇంకొకవైపు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారుల విచారణ... ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నప్పటికీ టీమిండియా పేసర్‌ మహ్మద్ షమీ తన ప్రాక్టీస్‌ ను మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పటికే మసకబారిన ప్రతిష్ఠను కూడగట్టుకునేందుకు అతని ముందున్న ఏకైక అస్త్రం ఐపీఎల్ లో రాణించడం.

ఈ నేపథ్యంలో షమీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. తాజాగా షమి బౌలింగ్‌ ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. షమీ ప్రాక్టీస్ వీడియోను చూసిన అభిమానులు, అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్ లో ఆడాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

mohammad shami
team india
Social Media
Viral Videos
  • Loading...

More Telugu News