Russia Model: అత్యాచారం చేయబోయిన అమెరికన్ వ్యాపారవేత్త... ఆరో అంతస్తు నుంచి దూకేసిన రష్యా మోడల్!

  • కాంట్రాక్టు నిమిత్తం దుబాయ్ కి వచ్చిన మోడల్ ఎకతేరినా
  • స్టార్ హోటల్ గదిలో అత్యాచారయత్నం
  • నిందితుడు పారిపోతుండగా ఎయిర్ పోర్టులో అరెస్ట్
  • నేరం రుజువైతే 15 సంవత్సరాల జైలు శిక్ష

తనపై జరుగుతున్న అత్యాచారయత్నం నుంచి తప్పించుకునేందుకు  ఓ యువ మోడల్, ఆరో అంతస్తు నుంచి దూకేసి తీవ్ర గాయాలపాలైన ఘటన దుబాయ్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ కాంట్రాక్టు పని నిమిత్తం దుబాయ్ వచ్చిన రష్యాకు చెందిన మోడల్ ఎకతేరినా స్టేట్సీయుక్, ఇక్కడి ఓ స్టార్ హోటల్ లో బస చేసింది.

అదే హోటల్ లో దిగిన అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఆమెపై కన్నేశాడు. ఆమె గదికి వెళ్లి అత్యాచారం చేయబోగా, తప్పించుకునేందుకు ఆమె ఆరో అంతస్తు నుంచి కిందకు దూకగా, వెన్నెముక విరిగింది. ఎకతేరినాను గమనించిన అక్కడి సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు తనకు చుట్టుకుంటుందన్న భయంతో సదరు వ్యాపారి పారిపోయేందుకు ప్రయత్నించగా, విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం రుజువైతే అతనికి 15 సంవత్సరాల వరకూ జైలు శిక్ష తప్పదని దుబాయ్ న్యాయవర్గాలు చెబుతున్నాయి.

Russia Model
US Businessman
Dubai
Rape Atempt
  • Loading...

More Telugu News