gnanavel raja: హీరోయిన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నిర్మాత భార్య!

  • హీరోయిన్లను వేశ్యలతో పోల్చిన నేహా
  • అలాంటి వాళ్లను నేను పబ్లిక్ లో కొడతాను
  • 'సింగం-3' సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేసిన నేహా

హీరోయిన్లను వేశ్యలతో పోలుస్తూ ప్రముఖ తమిళ సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించాయి. 'పచ్చని సంసారాలను కూల్చేసేవారు హీరోయిన్లు' అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, తాను హీరోయిన్లందరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... తన వ్యాఖ్యలు కొందరికి మాత్రమే వర్తిస్తాయని చెప్పారు. త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తానని మరో బాంబు వేసింది.

తప్పుడు దారిలో వెళ్తూ... ఆనందంగా ఉన్న కుటుంబాల్లో సమస్యలను సృష్టించే వారిని శిక్షించాలని ఆమె పేర్కొన్నారు. భర్తలను నియంత్రించడం భార్యల బాధ్యత అని... బరితెగించే భార్యలను నియంత్రించాల్సిన బాధ్యత భర్తలదని చెప్పారు. ఇలాంటి మహిళలను తాను పబ్లిక్ లో కొడతానని అన్నారు. అయితే కాసేపటికే ఆమె తన ట్వీట్లను డిలీట్ చేశారు.

తర్వాత మళ్లీ కొత్త ట్వీట్ చేశారు. తన భర్తతో తనకు ఎలాంటి సమస్య లేదని కొత్త ట్వీట్ లో పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న పురుషుల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారని... అలాంటి వారి గురించే తాను ట్వీట్లు పెట్టానని చెప్పారు. 'సింగం-3' సినిమాకు నేహా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేశారు. 

gnanavel raja
neha
wife
heroines
comments
prostitutes
  • Loading...

More Telugu News