Pawan Kalyan: నిరాహారదీక్ష ఎప్పుడు చేయాలో పవన్ కు సలహా ఇచ్చా: సీపీఎం నేత మధు

  • ఏప్రిల్ తర్వాత నిరాహారదీక్ష చేయాలని సలహా ఇచ్చా
  • నాలుగేళ్ల నష్టానికి టీడీపీనే బాధ్యత వహించాలి
  • బీజేపీకి జనసేన తొత్తు అనే ఆరోపణలు సరికాదు

ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం చేపట్టాలనుకున్న నిరాహారదీక్షను ఏప్రిల్ తర్వాత చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చానని సీపీఎం కార్యదర్శి మధు పేర్కొన్నారు. విభజన హామీల కోసం విశాఖపట్నంలోని మద్దిలపాలెం జంక్షన్ వద్ద సీపీఎం నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, రాష్ట్రానికి నాలుగేళ్లపాటు జరిగిన నష్టానికి తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు. బీజేపీకి జనసేన పార్టీ తొత్తుగా మారిందని చంద్రబాబు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సీపీఎం పాదయాత్రకు జనసేన, వైసీపీ, లోక్ సత్తా పార్టీలు మద్దతు పలికాయి. 

Pawan Kalyan
cpm madhu
Jana Sena
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News