USA: ఫ్లోరిడాలోని పాఠశాలలో దుండగుడి కాల్పులు

  • మేరీల్యాండ్ లోని గ్రేట్ మిల్స్ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు 
  • ఎవరూ మృతి చెందలేదని ప్రకటన 
  • పరిసరాలలోని పాఠశాలలన్నీ మూసివేత  

అమెరికా విద్యాలయాలు రక్తసిక్తమవుతున్నాయి. విద్యాకుసుమాలు విరబూయాల్సిన చోట కరకు తుపాకుల మోతమోగిస్తున్నాయి. దాని వివరాల్లోకి వెళ్తే... అమెరికా ఫ్లోరిడాలోని మేరీల్యాండ్‌ లోని గ్రేట్‌ మిల్స్‌ హైస్కూల్‌ లోకి సాయుధుడైన గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు.  

కాల్పుల శబ్దం విన్న పోలీసులు హుటాహుటీని సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందలేదని తెలిపిన పాఠశాల యాజమాన్యం, పాఠశాలకు ఎవరూ రావొద్దని సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు సూచించింది. ఆ పరిసరాల్లోని ఇతర స్కూళ్లను కూడా యాజమాన్యాలు మూసివేశాయి. ఇటీవలే ఒక పాఠశాలలో పూర్వ విద్యార్థి కాల్పులు జరిపి 17 మందిని పొట్టన బెట్టుకున్న ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఫ్లోరిడా ఆందోళన చెందుతోంది.

USA
america
florida
marryland
great mills school
gun fire
  • Loading...

More Telugu News