murali vijay: మురళీ విజయ్! నువ్వింకా ఎదగాలి: నెటిజన్ల విమర్శలు

  • టీమిండియాను అభినందిస్తూ ట్వీట్ చేసిన మురళీ విజయ్
  • డీకే ప్రస్తావన లేకపోవడంతో మండిపడ్డ అభిమానులు
  • ఇంకా ఎదగాలంటూ మురళీ విజయ్ పై విమర్శలు

నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ లో విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ క్రికెటర్ మురళీ విజయ్ ‘ఇదొక గొప్ప విజయం.. భారత క్రికెట్‌ బ్రాండ్‌ విలువను పెంచేందుకు బీసీసీఐ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ అతనిని విమర్శల పాలు చేసింది. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మురళీ విజయ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఆ ట్వీట్ లో దినేష్ కార్తీక్ ప్రస్తావన లేకపోవడంతో ఒక నెటిజన్ ‘విజయ్‌, నీకు ఇదేమీ కొత్త కాదు.. ఇంతకు ముందు తమిళనాడు జట్టు విజయ్‌ హజారే ట్రోఫీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన డీకేని విస్మరించావు. నువ్వింకా ఎదగాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

 మరో నెటిజన్ ‘మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, నిజాయతీగా స్పందించడం నేర్చుకో’ అంటూ సలహా ఇచ్చాడు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా, ‘డీకే పేరును ప్రస్తావించకపోవడానికి ఉన్న స్పష్టమైన కారణాలేంటో’ అంటూ ప్రశ్నించాడు. పలువురు నెటిజన్లు మురళీ విజయ్ ను విమర్శిస్తున్నారు. స్పోర్టివ్ స్పిరిట్ తో ఉండాలని సూచించారు.

కాగా, ఒకప్పుడు మురళీ విజయ్, దినేష్ కార్తీక్ లు మంచి స్నేహితులు. అయితే, దినేశ్‌ కార్తిక్‌ మాజీ భార్య నిఖితను మురళీ విజయ్‌ వివాహం చేసుకున్న నాటి నుంచి దూరమయ్యారు. కాగా, దినేశ్‌ కార్తిక్‌ స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌ ను 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

murali vijay
Social Media
dinesh kartik
team india
  • Error fetching data: Network response was not ok

More Telugu News