china: సమాధి నుంచి 2 వేల ఏళ్లనాటి మద్యం వెలికితీత!

  • క్విన్ రాజవంశ సమాధుల నుంచి వెలికితీత
  • ఇత్తడి కెటెల్‌లో 300 మిల్లీ లీటర్ల మద్యం
  • పులియబెట్టడం పద్ధతి ద్వారా తయారు చేసి ఉంటారన్న పరిశోధన కారులు

చైనాలోని పురాతత్వ శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన మద్యాన్ని గుర్తించారు. రెండువేల ఏళ్ల క్రితం పాలించిన క్విన్ రాజవంశానికి చెందిన ఓ సమాధి నుంచి ఇత్తడి కెటెల్‌ (నీళ్లు పోసుకునే చెంబులాంటి పాత్ర) ను వెలికి తీసిన శాస్త్రవేత్తలు అందులో మద్యం ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మొత్తం 260 పాత్రలను సమాధి లోంచి వెలికి తీయగా అందులో ఇదొకటి. వీటిలో చాలా వరకు పూజాదికాల్లో ఉపయోగించే వస్తువులు ఉన్నాయి.

సహజ సిద్ధమైన ఫైబర్‌తో సీల్ చేసిన ఈ కెటెల్‌లో 300 మిల్లీ లీటర్ల మద్యం ఉన్నట్టు పరిశోధనకారుడు ఝు వీహాంగ్ తెలిపారు. పారదర్శకమైన పాల తెలుపులో ఉన్న ఈ మద్యాన్ని పులియబెట్టడం పద్ధతి ద్వారా తయారుచేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ లిక్కర్‌పై మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు. క్విన్ రాజ్యం రాజధాని అయిన జియాన్‌యాంగ్‌లో అప్పటి వైన్ తాగే పద్ధతులు, తయారీ విధానాలను అర్థం చేసుకునేందుకు మరింత పరిశోధన అవసరమని వివరించారు. తాజాగా బయటపడిన వస్తువుల్లో ఇత్తడితో చేసిన 60 సెంటీమీటర్ల పొడవైన పదునైన కత్తి కూడా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News