adi narayana reddy: పవన్ కల్యాణ్‌కు అచ్చం జగన్‌లా సీఎం కావాలన్న ఆశ ఉంది: ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

  • రాజకీయమంటే మూడు పాటలు, ఆరు డ్యూయెట్లు కాదు
  • పవన్ ఒక పార్ట్ టైమ్ రాజకీయ వేత్త
  • వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోతుందనే మేము మద్దతు ఇవ్వలేదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. ప‌వన్‌కు కూడా అచ్చం జగన్‌లాగే సీఎం కావాలన్న ఆశ ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ... రాజకీయమంటే మూడు పాటలు ఆరు డ్యూయెట్లు కాదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు స్పష్టత లేదని, ఆయన ఒక పార్ట్ టైమ్ రాజకీయ వేత్త అని అన్నారు.

కాగా, నాలుగేళ్లుగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తమకు చుక్కలు చూపించిందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై నిలబడి మాట నిలుపుకోవాలని చెప్పారు. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే అది వీగిపోతుందనే తాము మద్దతు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రశాంత్ కిశోర్ కంటే తెలివైన వాళ్లని, ఆయన ట్రిక్కులు ఇక్కడ సాగవని విమర్శించారు.    

adi narayana reddy
Telugudesam
BJP
Pawan Kalyan
  • Loading...

More Telugu News