nagashourya: నాగశౌర్య ధోరణి పట్ల కోన వెంకట్ అసహనం

  • నూతన దర్శకుడితో నాగశౌర్య
  • 'ఛలో'కి ముందే ఒప్పందం
  • స్క్రిప్ట్ విషయంలో నాగశౌర్య అసంతృప్తి 

'ఛలో' సినిమా సక్సెస్ తో నాగశౌర్య మాంచి ఉత్సాహంతో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సాయిశ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'ఛలో' సినిమాకి ముందే నాగశౌర్య ఈ సినిమాకి సైన్ చేశాడు. 'ఛలో' సినిమా తరువాత నాగశౌర్య పారితోషికం పెంచడం .. కొత్త సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తిని ప్రదర్శించడం చేస్తున్నాడట.

దాంతో ఈ సినిమాకి క్రియేటివ్ హెడ్ గా వున్న కోన వెంకట్ .. నాగశౌర్య ఈ విధంగా వంకలు పెడుతుండటం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'ఛలో' సినిమాకి ముందు నచ్చిన కథ .. ఆ తరువాత నాగశౌర్యకు ఎందుకు నచ్చడం లేదో అర్థం కావడం లేదంటూ ఆయన అసహనానికి లోనయ్యారు. ఈ సినిమాకి నాగశౌర్య సైన్ చేసిన మాట వాస్తవమేగానీ .. పూర్తి కథను నాగశౌర్యకు చెప్పలేదని ఆయన తండ్రి అంటున్నారు. ఈ గొడవ గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి మరి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News