Mohammed bin Salman: నేనేమైనా మహాత్మానా? లేక మండేలానా? వ్యక్తిగత ఖర్చులపై సౌదీ యువరాజు వ్యాఖ్యలు...!
- తన సంపద పూర్తిగా తన వ్యక్తిగత వ్యవహారమని యువరాజు స్పష్టీకరణ
- తాను సంపన్నుడే గానీ పేదవాడిని కానని వెల్లడి
- ఆదాయంలో 51 శాతం పేదలకు, 49 శాతం తన కోసం ఖర్చు చేస్తానని ప్రకటన
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విలాసవంతమైన, దుబారాతో కూడిన వ్యక్తిగత జీవితం గురించి మీడియా ప్రస్తావించినప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. తనకున్న సంపద పూర్తిగా తన వ్యక్తిగత వ్యవహారమని ఆయన తేల్చిచెప్పారు. తన వ్యక్తిగత ఖర్చులకు సంబంధించినంత వరకు తాను సంపన్నుడే గానీ పేదవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇలా చెబుతూ చెబుతూనే తాను మహాత్మా గాంధీనో లేక నెల్సన్ మండేలానో కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓ వ్యక్తిగా తన వ్యక్తిగత ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తన ఆదాయంలో కనీసం 51 శాతం పేదప్రజలపై, మరో 49 శాతం తన కోసం ఖర్చు చేస్తానని బిన్ చెప్పుకొచ్చారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత నివాసమైన 'ఫ్రెంచ్ కోట'కు బిన్ యజమాని అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.