baaghi-2: ఏక్, దో, తీన్, అంటూ వచ్చేసిన మోహినీ... వైరల్ వీడియో

  • 2016లో వచ్చిన ‘బాఘి’ సినిమాకు ఇది సీక్వెల్‌ గా ‘బాఘి 2’
  • మార్చి 30న విడుదల కానున్న ‘బాఘి 2’
  • ‘తేజాబ్‌’ సినిమాలో మాధురీ దీక్షిత్ ‘ఏక్‌ దో తీన్‌..’ రీమిక్స్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్

1990ల్లో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘తేజాబ్‌’ సినిమాలో మాధురీ దీక్షిత్ ఆడిపాడిన ‘ఏక్‌ దో తీన్‌..’ పాట గుర్తుందా? ఆ పాటకు రీమిక్స్ వెర్షన్ వచ్చేసింది. బాలీవుడ్ రియల్ లైఫ్ హాట్ కపుల్ టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘బాఘి 2’ సినిమాలో ఈ పాటను దర్శకుడు, కొరియోగ్రాఫర్ అహ్మద్‌ ఖాన్‌ పెట్టాడు. 2016లో వచ్చిన ‘బాఘి’ సినిమాకు ఇది సీక్వెల్‌ గా రూపొందుతోంది. ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. కాగా, ఈ పాటలో మోహినీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించింది. మాధురీ పాటను ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ పాడగా, రీమిక్స్‌ పాటను శ్రేయా ఘోషల్‌ పాడింది.

స్వతహాగా కొరియోగ్రాఫరైన అహ్మద్ ఖాన్ పాత పాటతో ఈ పాటను పోల్చకుండా వుండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకే ఒక్క స్టెప్పు మినహా మిగిలినవన్నీ కొత్త స్టెప్పులను కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయగా, వైరల్ అవుతోంది. దీనిపై జాక్వెలిన్ మాట్లాడుతూ, ‘మాధురి డ్యాన్స్‌ చేసినంత గొప్పగా ఎవ్వరూ చేయలేరని చెప్పింది. ఈ పాటకు తనను ఎంచుకున్నప్పుడు ‘చేయగలనా’ అని భయపడ్డానని, అయితే స్టెప్పుల విషయంలో పోలిక ఉండదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నానని తెలిపింది. కాగా, మాధురి పాట ఏడు నిమిషాల నిడివి ఉండగా, జాక్వెలిన్‌ పాట రెండు నిమిషాల నిడివి కూడా లేకపోవడం విశేషం.   

baaghi-2
tighe shroff
disa pathani
tezab
ek do teen
jaquelin fernandese
  • Error fetching data: Network response was not ok

More Telugu News