rammohan naidu: రేపు మీకూ ఇటువంటి పరిస్థితులు రావచ్చు!: టీఆర్ఎస్ పై మండిపడ్డ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • అవిశ్వాస తీర్మానానికి 100 మందికిపైగా ఎంపీల మద్దతు
  • రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది
  • చర్చసాగేందుకు సహకరించాలని అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ను కోరుతున్నాం
  • మేము ఎవ్వరికీ భయపడబోం

తాము ప్రవేశపెట్టాలనుకున్న అవిశ్వాస తీర్మానానికి 100 మందికిపైగా ఎంపీలు మద్దతుగా నిలబడ్డారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అవిశ్వాసం నోటీసుపై చర్చకు సిద్ధంగా ఉన్నామంటున్న కేంద్ర సర్కారు ఆందోళన చేస్తోన్న ఎంపీలకు నచ్చజెప్పలేదా? అని ప్రశ్నించారు. తమకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోందని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించాలని అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ను తాము కోరుతున్నామని అన్నారు.

రేపు ఇటువంటి పరిస్థితులు టీఆర్ఎస్‌కు కూడా రాకపోవని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. మేము ఎవ్వరికీ భయపడబోమని, విభజన హామీలు అమలు చేస్తారని నాలుగేళ్లు ఎదురు చూశామని, అంతిమ విజయం సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 

rammohan naidu
Telugudesam
TRS
  • Loading...

More Telugu News