kangana ranut: నా అభిప్రాయాలకు అడ్డు చెప్పకుండా ఉంటే...రాజకీయాల్లోకి వస్తా: కంగన రనౌత్

  • రాజకీయ నాయకుల ఫ్యాషన్ నచ్చదు
  • నా ఫ్యాషన్, మాటతీరు రాజకీయ నాయకులకు నచ్చవు
  • రాజకీయాల గురించి తప్పుగా అనుకుంటారు

తన అభిప్రాయాలకు అడ్డు చెప్పకపోతే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమని ప్రముఖ బాలీవుడ్‌ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ తెలిపింది. కంగన రాజకీయాల్లోకి రానుందని, బీజేపీలో చేరనుందని, ఈ మేరకు పీఎం మోదీని కూడా కలవనుందని గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో  ఢిల్లీలో నిర్వహించిన ‘రైజింగ్‌ ఇండియా సమ్మిట్‌’ లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ రంగం గురించి అంతా తప్పుగా అనుకుంటారు కానీ, ఈ రంగం చాలా అద్భుతమైనదని పేర్కొంది.

తనకు రాజకీయనాయకుల ఫ్యాషన్ సెన్స్ నచ్చదని తెలిపింది. తాను రాజకీయాల్లోకి రానున్నానంటూ వార్తలు వెలువడుతుంటాయని, తాను ధరించే దుస్తులు, తన మాట తీరు చూసి ఎవరూ తమ పార్టీలోకి తీసుకోరని చెప్పింది. తన ఫ్యాషన్, తన అభిప్రాయాలకు అడ్డు చెప్పకుండా ఉంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కంగనా తెలిపింది. మోదీ అంటే తనకు అభిమానమని పేర్కొన్న ఆమె, జీవితంలో ఆయన విజయం సాధించిన తీరు అద్భుతమని పేర్కొంది. ఒక ఛాయ్ వాలా ప్రధాని కాగలిగారంటే అది ప్రజాస్వామ్యం గొప్పదనమని కంగనా అభిప్రాయపడింది.

kangana ranut
kangana
politics
political entry
  • Loading...

More Telugu News