west bengal: కేసీఆర్ కు రుచికరమైన విందుకోసం మమతా బెనర్జీ ప్రత్యేక ఏర్పాట్లు!

  • భోజన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మమతా బెనర్జీ
  • మెనూలో పదార్థాలపై సలహాలు, సూచనలు
  • బెంగాలీ వంటకాలు సిద్ధం

ఈ మధ్యాహ్నం కోల్ కతాకు చేరుకునే కేసీఆర్ కు రుచికరమైన విందును అందించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ఆమే స్వయంగా పరిశీలించి, మెనూలో ఉండాల్సిన పదార్థాలపై సలహాలు, సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. కేసీఆర్ కోసం ప్రత్యేక బెంగాలీ వంటకాలను సిద్ధం చేయాలన్న ఆమె ఆదేశాలను అందుకున్న సిబ్బంది మిస్తీ పలావ్, కలాయిర్ దాల్, బేగున్ భాజా, ఆలూ పోస్తో, చనార్ దాల్నా, పరోటా, కాషా మాంగ్షో తదితరాలను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు బెంగాల్ లో ఫేమస్ అయిన పలు రకాల స్వీట్స్, మిక్చర్ వంటివాటినీ రెడీ చేస్తున్నారు. కేసీఆర్ మధ్యాహ్న భోజన సమయానికి కోల్ కతా చేరుకోనుండగా, భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యా చర్చలు ప్రారంభమవుతాయి.

west bengal
KCR
Mamata
Kolkata
Lunch
  • Loading...

More Telugu News