nitin: నితిన్ కొత్త సినిమా నుంచి మ‌రో మూడు పాట‌లు, న్యూ స్టిల్స్‌ విడుద‌ల.. చిత్రం విడుదల తేదీ ప్రకటన

  • ఉగాది సందర్భంగా విడుదల
  • ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు 'ఛల్ మోహన్ రంగ'
  • పాటకి కొత్త రీతిలో సంగీతం అందించిన థమన్‌

ఇటీవలి కాలంలో ఏ పండుగ వచ్చినా యూట్యూబ్ లో కొత్త సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అలాగే, యువ కథానాయకుడు నితిన్, కథానాయిక మేఘా ఆకాష్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న‌ 'ఛల్ మోహన్ రంగ' చిత్రం ఆల్బమ్ ను కూడా ఈ ఉగాది సందర్భంగా నేడు విడుదల చేశారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, నిఖితా రెడ్డి సమర్పణలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన మూడు పాటలలానే, ఈ కొత్త అల్బ‌మ్ లో విడుదలైన మిగతా మూడు పాటలు కూడా అల‌రిస్తున్నాయి.  

 ఆల్బమ్ లో ప్రతి పాటకి కొత్త రీతిలో సంగీతం అందించించాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్. మాస్ నుంచి క్లాస్ వరకు, ప్రేమ నుంచి విరహం వరకు, సంతోషం నుంచి బాధ వరకు, అన్నింటిని ఎంతో బాగా స్వరపరిచి ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ ఇచ్చారు. అమెరికా, ఊటీ, హైదరాబాద్ లలో అందమైన ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి ఎన్ నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం: కేవీ నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.   

nitin
chal mohana ranga
songs
  • Error fetching data: Network response was not ok

More Telugu News