Mahanati: 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రిలీజ్ తేదీనే 'మహానటి' విడుదల...!

  • మే 9న విడుదల కానున్న 'మహానటి' చిత్రం
  • మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా అదే రోజే విడుదల
  • బ్యాలెన్స్ సీన్ల షూటింగ్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీ

అలనాటి అందాల నటి సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న 'మహానటి' చిత్రం విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మే 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపైనే 1990ల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం కూడా ఇదే తేదీనే విడుదల కావడం గమనార్హం. ప్రస్తుతం మహానటి చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ సీన్ల షూటింగ్ పరంగా ప్రస్తుతం చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

టైటిల్ రోల్‌ను హీరోయిన్ కీర్తి సురేష్ పోషిస్తుండగా సమంత, దుల్ఖర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, అవసరాల శ్రీనివాస్, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్‌ ఇతర తారాగణం. మరో ముఖ్య విశేషమేమిటంటే, ఇందులో ఏఎన్‌ఆర్ పాత్రను ఆయన మనవడు, యువ హీరో నాగ చైతన్య పోషిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ బాణీలు సమకూర్చారు.

Mahanati
Vyjayanthi Movie
Megastar
Samantha
ANR
Naga chaitanya
  • Loading...

More Telugu News