Yamuna Express Way: ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు ఎయిమ్స్ వైద్యుల దుర్మరణం

  • యమునా ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం
  • కంటెయినర్ ను ఢీకొన్న డాక్టర్ల వాహనం
  • మరో ముగ్గురికి గాయాలు

మధుర సమీపంలో యమునా ఎక్స్ ప్రెస్ వేపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు చెందిన ముగ్గురు వైద్యులు దుర్మరణం పాలయ్యారు. డాక్టర్లు వెళుతున్న వాహనం, ఓ కంటెయినర్ ను బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు అసుపత్రికి తరలించారు. ఢిల్లీ నుంచి వీరంతా ఆగ్రాకు వెళుతున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవలి కాలంలో యమునా ఎక్స్ ప్రెస్ వేపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Yamuna Express Way
AIIMS
Doctors
Road Accident
  • Loading...

More Telugu News