mohammed shami: తన భార్యపై అత్యాచారయత్నం జరగలేదన్న టీమిండియా పేసర్

  • హసీన్ పై అత్యాచారయత్నం జరగలేదన్న షమీ
  • అప్పడు నా సోదరుడు మాతో లేడు
  • ఈ కేసుతో ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి

తనపై తన భర్త సోదరుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సోదరుడిని గదిలోకి పంపి... బయట షమీ తాళం వేశాడని, తాను గొడవ చేస్తే మళ్లీ తలుపు తీశాడని ఆమె ఆరోపించారు.

ఈ నేపథ్యంలో షమీ స్పందిస్తూ... అత్యాచారయత్నం జరిగిందంటూ హసీన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. హసీన్ చెబుతున్నట్టు డిసెంబర్ 7వ తేదీన తన సోదరుడు ఇక్కడ లేడని... ముర్దాబాద్ లో ఉన్నాడని చెప్పాడు. తాను కూడా డిసెంబర్ 2 నుంచి 6 వరకు టెస్ట్ మ్యాచ్ ఆడానని... ఆ తర్వాత భువనేశ్వర్ రిసెప్షన్ కు తన భార్యతో కలసి హాజరయ్యానని తెలిపాడు. డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు తమ స్వస్థలానికి వెళ్లామని చెప్పాడు. ఇలాంటప్పుడు ఆమెపై తన సోదరుడు అత్యాచారయత్నం చేయడం ఎలా సంభవమని ప్రశ్నించాడు. హసీన్ కేసుతో చాలా జీవితాలు ముడిపడి ఉన్నాయని... పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని, విచారణను పూర్తి చేయాలని కోరాడు.  

mohammed shami
hasin jahaan
rape attempt
  • Loading...

More Telugu News